బీహార్ బెంగాల్ ఫార్ములాను ఇక్కడా ప్రయోగిస్తున్నారు -కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష ప్రభుత్వాలపై దాడి -పాలేరు ‘బి.ఎల్.ఏ’ల శిక్షణ శిబిరంలో మంత్రి పొంగులేటి నిప్పులు

ఖమ్మం(నమస్తే )ఏదులాపురం మున్సిపాలిటీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష ప్రభు త్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా సరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. దేశవ్యాప్తంగా బీజేపీపాలితా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజా స్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (బి.ఎల్.ఏ) అవగాహన శిక్షణ శిబిరం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్డులో గల పీవీఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను ఎండగడుతూ సుదీర్ఘంగా ప్రసంగించారు.
ఎస్‌ఐఆర్ ఒక పెద్ద భూతం దొంగదారి చర్య!కేంద్ర ప్రభుత్వం చట్టం రూపంలో తీసుకువచ్చిన ఎస్‌ఐఆర్’ ఒక పెద్ద భూతం లాంటిదని ఇది ముమ్మాటికీ దొంగదారి చర్యేనని మంత్రి విమ ర్శించారు.కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఎక్కడైతే మనకు ఓట్లు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఒక పద్ధతి ప్రకారం దాదాపు 30 నుంచి 35 శాతం ఓట్లను ‘ఫేక్ ఓట్లు’గా చిత్రీకరించి వాటిని జాబితా నుంచి తొలగించేందుకు కేంద్రం పెద్ద కుట్ర చేస్తోంది ఓటరు వయస్సులో స్వల్ప తేడాలున్నా పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ (రావుకు బదులు రెడ్డి హుస్సేన్ బదులు అని పడటం) ఉన్నా వాటన్నింటినీ వంకగా చూపి ఓట్లను లేపేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఈ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను ఇప్పుడు తెలంగాణలోనూ ప్రయోగించాలని చూస్తు న్నారు. దీన్ని కాంగ్రెస్ సైనికులు గట్టిగా తిప్పికొట్టాలి అని మంత్రి పిలుపునిచ్చారు.
నిన్న ఓట్లు నేడు ఏకంగా సీట్లే దొంగిలిస్తున్నారు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాన్ని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీనాక్షి నటరాజన్ కి కావలసిన ఓట్ల కంటే 11 ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కేవలం ఒక పాత ఎఫ్‌ఐఆర్ కాగితాన్ని సాకుగా చూపి ఎన్నికల అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అక్రమంగా ఆమె నామినేషన్‌ను తిరస్కరింప జేశారు. ఈ