కావున ప్రత్తి వేసిన రైతులందరూ తప్పనిసరిగా ఎకరానికి 1900 రూపాయలు చెల్లించి గడువు పూర్తయ్యే లోగా పంటల బీమా పథకం నందు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు

తిరువూరు :--తిరువూరు పట్టణం లోని నడిమి తిరువూరు లోవ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏ డి ఏ ఎం.శ్రీనివాస రావు మాట్లాడుతూ రైతులందరూ ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో సాగుచేసిన అన్ని పంటలను తప్పనిసరిగా ఈ -పంట (డిజిటల్ క్రాప్ సర్వే) నందు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.

రైతులు తాము సాగు చేసిన పంటల వివరాలు అనగా పంట పేరు, వెరైటీ, విత్తిన/నాటిన తేదీ తదితర వివరాలను రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియజేసి పంట నమోదు చేయించుకోవాలని కోరారు.పంట నమోదు వలన ప్రయోజనాలను గూర్చి ఆయన వివరించారు.పంట ఉత్పత్తులనుకనీసమద్దతుధరకుఅమ్ముకొనుటకుఉపయోగపడుతుందని,ప్రకృతివైపరీత్యాలుసంభవించినప్పుడు నష్టపరిహారం పొందుటకు, ఈ పంట నమోదు తప్పనిసరని, సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ పొందుటకు, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువులు పొందుటకు, ఇతర ప్రభుత్వ పథకాలకు, వరి మినహా అన్ని పంటలకు పంటల బీమా చేయించుకొనుటకు ఈనెల 31వ తేదీ,వరి పంటకు మాత్రం 15 చివరి తేదీ అని పేర్కొన్నారు. కావున ప్రత్తి వేసిన రైతులందరూ తప్పనిసరిగా ఎకరానికి 1900 రూపాయలు చెల్లించి గడువు పూర్తయ్యే లోగా పంటల బీమా పథకం నందు నమోదు చేయించుకోవాలని ఆయన కోరారు

.ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాన్ని ఆర్దికంగా ప్రయోజనం చేకూర్చడానికి పంటల బీమా తప్పనిసరి అని మండల వ్యవసాయ శాఖ అధికారిణి పి పద్మ తెలియచేశారు.రైతు సేవా కేంద్ర సిబ్బంది అందరూ పంటల బీమా మరియు ఈ పంట నమోదు ఉపయోగాలు, ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో ఏవో పద్మ, ఏఈవో కావ్య సింధు, రైతు సేవా కేంద్ర సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.