తిరువూరు నుంచి భారీగా తరలిన నాయకులు, కార్యకర్తలు
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, డీఎస్సీ ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం విజయవాడలో నిరసన ర్యాలీ నిర్వహించింది.
ఈ నిరసన కార్యక్రమానికి తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విజయవాడకు తరలివెళ్లి పాల్గొన్నారు.