నగర విస్తరణలో భాగంగా ఏర్పాటైన ప్రాంతాల్లో డ్రైనేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తిరుపతి నగరాన్ని అన్ని విధాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. 35ఏళ్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ స్థానంలో కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు 188 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు.

స్టామ్ వాటర్ డ్రైన్ ను మెరుగు పరిచేందుకు 135 కోట్ల రూపాయల రుణం త్వరలో మంజూరు అవుతుందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఉదయం ఒకటవ డివిజన్ లోని సుబ్బారెడ్డి నగర్ లో 27లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం రెండవ డివిజన్ లోని పూలావాణిగుంట లో 80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్ ను ఎమ్మెల్యే ఆరణి ప్రారంభించారు. నగరంలో మౌలికసదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ పాతది కావడంతో అక్కడక్కడా లీకేజీలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పారు. పాత డ్రైనేజీ స్థానంలో కొత్తది తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

నగర విస్తరణలో భాగంగా ఏర్పాటైన ప్రాంతాల్లో డ్రైనేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు నగర అభివృద్ధి పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఎస్ ఈ శ్యాంసుందర్, ఈఈ తులసి కుమార్ , గోమతి, డీఈ రమణ, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.