కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలోని ప్రమాదకరంగా మారిన బ్రిడ్జి కొత్త బ్రిడ్జి నిర్మించండి. ముద్రాజ్ కొరివి నరసింహులు.గత వర్షాకాలంలో కూలిన వంతెన. రోడ్డుని మళ్లీ వర్షాకాలం వచ్చింది పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
రాత్రి వేళలో చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అయినా ఎలాంటి స్పందన లేని అధికారులు నాయకులు. ప్రభుత్వాలు ప్రతి దానిని రాజకీయాలు చేయకండి. మాకు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చేంతవరకు వేచి చూడాలా ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒక్కటే.ప్రభుత్వాల పట్ల చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత చూపించాల్సి వస్తుంది.
నాయకులు అధికారులు స్పందించరా బీబీపేట నాలుగు జిల్లాల కూడలి కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల మెదక్ వీళ్లు అందరూ ఇదే రోడ్డుపైన ప్రయాణం చేస్తారు. అట్లాంటి రోడ్డును మీరు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బీబీపేట్ గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కోరుకుంటున్నారు