ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం తాతయ్య గారు, డీసీపీ లక్ష్మీనారాయ, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర

_*జగ్గయ్యపేటలో ‘డ్రగ్స్ పై దండయాత్ర 3.0*’.._

_*ఘనంగా భారీ అవగాహన సదస్సు*_

_*ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే & తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ శ్రీరాం తాతయ్య గారు, డీసీపీ లక్ష్మీనారాయ గారు*_

_యువత భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తు పదార్థాల మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా జగ్గయ్యపేట పట్టణంలో భారీ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీఐ పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం కోదాడ రోడ్డులోని సత్య ఫంక్షన్ హాల్ వేదికగా “డ్రగ్స్ రహిత జగ్గయ్యపేట పట్టణం” అనే సంకల్పంతో “డ్రగ్స్ పై దండయాత్ర 3.0” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రూరల్ డీసీపీ బీ. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గంజాయి రహిత సమాజ స్థాపన కోసం రూరల్ జోన్ ౩పరిధిలోని ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతున్నామని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ నిరంతర నిఘా, ముమ్మర తనిఖీల ఫలితంగా రూరల్ జోన్ పరిధిలో ఇప్పటివరకు 70 గ్రామాలను గంజాయి రహిత గ్రామాలుగా ప్రకటించినట్లు వెల్లడించారు. ఇందులో నందిగామ సబ్ డివిజన్ పరిధిలో 57, మైలవరం సబ్ డివిజన్ పరిధిలో 13 గ్రామాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మత్తు పదార్థాల నివారణకు కేవలం పోలీసుల చర్యలే సరిపోవని, ప్రజల సహకారం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ మాట్లాడుతూ డ్రగ్స్ లేని నవ సమాజ నిర్మాణంలో పోలీస్ శాఖ తీసుకుంటున్న ఈ చర్యలు అభినందనీయమని కొనియాడారు. డ్రగ్స్, ఆల్కహాల్ సేవించడం వల్లే మందు వల్లే ఎక్కువ శాతం నేరాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని, సమాజంలో గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని కోరారు. మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోవడమే కాకుండా కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మైనర్లు వాహనాలు నడుపుతుంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించాలని ఎమ్మెల్యే సూచించారు. జరిమానా విధించడం కన్నా కౌన్సెలింగ్ తోనే సత్ఫలితాలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వక్తలు మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత, విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు పోలీసులు తీసుకుంటున్న ఈ చొరవ అభినందనీయమని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ తీసుకొని దొరికితే కోర్టులో పడే కఠిన శిక్షల గురించి వివరించారు.

*ఐ లవ్ జగ్గయ్యపేట పోలీస్ : మునిసిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర*

"జగ్గయ్యపేట మున్సిపాలిటీ తరపున మేమంతా ఇక్కడి పోలీసుల లవ్ లో పడ్డాం".. జగ్గయ్యపేట పోలీసులు చాలా బ్యూటిఫుల్‌గా పని చేస్తున్నారు" అని మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ "జగ్గయ్యపేట పోలీసులు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నారో.. వాళ్లు వాడే జీప్ మాత్రం ఎన్నేళ్లయినా మారడం లేదు" అని చమత్కరించారు. పాత జీపుతోనే ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే కొత్త జీపును సమకూర్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగ్గయ్యపేట పట్టణం అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రస్తుతమున్న సిబ్బంది సరిపోవడం లేదని, జగ్గయ్యపేటకు అదనపు పోలీస్ సిబ్బందిని కేటాయించాలని ఆయన వేదికపై ఉన్న ఉన్నతాధికారులను కోరారు. అవగాహన సదుస్సుకు ప్రజలు, యువకులు భారీగా తరలివచ్చారు. జీవితంలో మత్తు పదర్థాలు వాడనని అందరితో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ చలసాని శ్రీనివాసరావు, జగ్గయ్యపేట మునిసిపల్ కమిషనర్ కృష్ణమోహన్, కౌన్సిలర్లు, బేజీపీ నాయకులు నోముల రఘు, ప్రముఖ న్యాయవాది సామినేని వెంకటేశ్వరరావు, , ప్రభుత్వాస్పత్రి వైద్యులు డాక్టర్ హరీష్, జగ్గయ్యపేట, చిల్లకల్లు ఎస్సైలు రాజు, శంకర్, సూర్య శ్రీనివాస్, మణికంఠతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.